HomeTelugu News'యాత్ర'కు క్లీన్ 'యూ' సర్టిఫికెట్!

‘యాత్ర’కు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్!

4 21వైఎస్ ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకు సింగిల్ కట్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమాలోని చాలా సీన్స్ హార్ట్ టచ్ గా ఉంటాయట. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుందట. రేసీ స్క్రీన్ ప్లే తో సినిమా చాలా స్పీడ్ గా పూర్తవుతుందని, బయోపిక్ అయినప్పటికీ ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 8 వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది. ఈ సినిమాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. సుహాసిని, అనసూయ, రావూ రమేష్‌, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu