‘అర్జున్ రెడ్డి’ ధైర్యం చూశారా..?

‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ తో అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిడివి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమా రిజల్ట్ విషయంలో నిడివి అనేది కీలక పాత్ర పోషిస్తోంది. రెండు గంటల 10 నిమిషాల నుండి 20 నిమిషాలు ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతకుమించి ఉంటే ల్యాగ్ అనే మాట వినిపిస్తుందని క్రిస్పీగా ఉండేలా చూసుకుంటున్నారు. 
కానీ ‘అర్జున్ రెడ్డి’ మాత్రం ఈ విషయంలో తగ్గేలా కనిపించడం లేదు. దాదాపుగా మూడు గంటల 10 నిమిషాల నిడివి గల చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత రన్ టైమ్ తో బాహుబలి వంటి పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. కానీ మొదటిసారి ఓ యంగ్ హీరో సినిమా ఇంత రన్ టైమ్ తో విడుదలవుతోంది. కానీ మూడు గంటల పాటు ఆడియన్స్ కు ఎంగేజ్ చేయడమనేది మామూలు విషయం కాదు. మరి ‘అర్జున్ రెడ్డి’ ఏం చేస్తాడో.. చూడాలి!