HomeTelugu Newsఅన్న 'సైరా' సెట్‌లో తమ్ముడు పవన్‌

అన్న ‘సైరా’ సెట్‌లో తమ్ముడు పవన్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చరిత్రత్మిక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సెట్‌లో ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా సెట్‌లో చిరు, అమితాబ్‌ బచ్చన్‌, రామ్‌చరణ్‌తో కలిసి పవన్‌ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే పవన్‌ తాజాగా సెట్‌కు వెళ్లారా, లేదా గతంలో జరిగిన షెడ్యూల్‌లో చిరును కలిశారా అనే విషయంపై స్పష్టత రాలేదు.

1 42

ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో చిరు గురువు పాత్రలో అమితాబ్‌ కనిపించనున్నారు. నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. 2019లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu