HomeTelugu News'ఎన్టీఆర్‌'లో చిరు పాత్ర?

‘ఎన్టీఆర్‌’లో చిరు పాత్ర?

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న‌ ‘ఎన్టీఆర్‌’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. సినీ కెరీర్‌కు సంబంధించి ఎన్టీఆర్‌ అనేక మందితో కలిసి పనిచేశారు. కాబట్టి వారి పాత్రల్ని కూడా ఈ బయోపిక్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు క్రిష్‌. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, హెచ్‌.ఎం. రెడ్డి, చక్రపాణి, ఎస్వీఆర్‌, కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రలు సినిమాలో ఉన్నట్లు తెలిసింది.

13 4

అయితే ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో సందడి చేశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. ఈ మేరకు ‘ఎన్టీఆర్‌’ లో చిరు పాత్ర కనిపిస్తుందా? లేదా? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిరు పాత్ర నిజంగా ఉంటే.. అందులో ఎవరు నటిస్తారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.కాగా ఈ సినిమాలో ఇప్పటికే తారాగణం, అతిథి పాత్రలు ఎక్కువయ్యాయని యూనిట్‌ భావిస్తోందట. మరి కొత్తగా చిరు పాత్ర ఉండబోతోంది అనడంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌’ రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. అయితే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu