పోలీస్ పాత్రలో పవన్!

పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నాడు పవన్. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా మొదటి భాగం మొత్తం కూడా తమిళంలో విజయ్ నటించిన ‘తేరి’ కథను పోలి ఉంటుందట.

సెకండ్ హాఫ్ మాత్రం డిఫరెంట్ గా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇది రీమేక్ మాత్రం కాదట. కథ ప్రకారం సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే పులి, గబ్బర్ సింగ్, సర్ధార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో పవన్ పోలీస్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆ పాత్రతో ఆడియన్స్ ను మెప్పిస్తారో.. లేదో.. చూడాలి!