HomeTelugu Big Stories'ఎన్టీఆర్‌'లో నా పాత్ర ప్రారంభం: రానా

‘ఎన్టీఆర్‌’లో నా పాత్ర ప్రారంభం: రానా

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ లో నందమూరి బాలకృష్ణ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రానా ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు నాయుడి పాత్రలోనే కనిపించనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రానా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించాడు.

5 1

‘గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నాను’ అంటూ బాలయ్య, క్రిష్‌లతో ఓ సెల్ఫీ దిగి తన సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. అయితే రానా ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు నాయుడి పాత్రలోనే కనిపించబోతున్నాడంటూ బాలీవుడ్‌ ట్రేడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణతోపాటు విష్ణు వర్ధన్‌, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌ రాజ్‌, విద్యాబాలన్‌, సీనియర్‌ నటుడు నరేష్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ‘ఎన్టీఆర్‌’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu