HomeTelugu Newsఎన్టీఆర్‌ 'అరవింద సమేత'ను వెంటడుతున్న లీక్స్‌

ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ను వెంటడుతున్న లీక్స్‌

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా వరుస లీకులతో చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న మూవీ స్టిల్‌ ఒకటి ఇటీవల లీక్‌ కాగా, తాజాగా అదే సీన్‌కు సంబంధించి మరిన్ని స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వైపు అంచనాలు పెరుగుతున్న ఈ మూవీకి లీకుల బెడద తలనొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకులు ఎవరు చేస్తున్నారన్న దానిపై మూవీ యూనిట్‌ దృష్టిసారించినట్లు సమాచారం. కాగా ఈ సినిమా టీజర్ విడుదల ఆగస్టు 15రోజున అని టీమ్ ప్రకటించి 24 గంటలు కూడ కాకముందే ఇలాంటి సమస్యలు తలెత్తడం విచారించాల్సిన విషయమే.

4a 1

ఇటీవల లీకైన ఫొటోలో ఎన్టీఆర్‌ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. తాజాగా లీకైన ఫొటోల్లో ఆ సీన్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలు ఉన్నాయి. జూన్‌ 21న షూటింగ్‌ జరిగినట్లు ఫొటోలపై మనం గమనించవచ్చు. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఉంటాయనిపిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్‌ 10న మూవీ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

4 8

Recent Articles English

Gallery

Recent Articles Telugu