
Jr NTR Expensive Watch Cost:
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ తన స్టైల్, సినిమాలతో హైలైట్‌లో ఉంటాడు. తాజాగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన అతని లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో సింపుల్ అయినప్పటికీ, అతని క్లాస్ అందర్నీ ఆకట్టుకుంది. కానీ అతని లుక్‌లో ప్రత్యేక ఆకర్షణ మాత్రం చేతికి ఉన్న రిచర్డ్ మిల్లే RM 40-01 టోర్భిలియన్ మెక్‌లారెన్ స్పీడ్టెయిల్ వాచ్. దీని విలువ ఏకంగా రూ. 7.47 కోట్లు!
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న War 2 హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే హృతిక్ రోషన్ డ్యాన్స్ రిహార్సల్స్‌లో గాయపడటంతో షూటింగ్ కొంతకాలం వాయిదా పడింది. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సినిమాలో ఓ భారీ డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడని సమాచారం.
War 2 పూర్తయ్యాక ఎన్టీఆర్ NTR 31 (టెంటేటివ్ టైటిల్: ‘డ్రాగన్’) షూటింగ్‌లో బిజీ కానున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఎన్టీఆర్ లుక్, స్క్రిప్ట్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
2025 జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ఫుల్ ప్యాక్‌డ్ ఇయర్. War 2, NTR 31, Devara: Part 2 షూటింగ్‌లు పూర్తవ్వగా, అతని స్టైల్ స్టేట్‌మెంట్స్ కూడా ట్రెండింగ్‌లో మారుతున్నాయి.
ALSO READ: Summer 2025 లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న Tollywood హీరోలు వీళ్లే