HomeTelugu Newsచిరుని కలిసి విషెస్‌ తెలిపిన పవన్‌

చిరుని కలిసి విషెస్‌ తెలిపిన పవన్‌

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్‌ కుటుంబ సమేతంగా చిరు ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తోపాటు ఆయన సతీమణి అన్నా లెజినోవా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఉన్న ఈ చిత్రాలకు అభిమానులు లైక్‌ చేసి తెగ కామెంట్లు పెడుతున్నారు. పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్ ఈ ఫొటోల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

7a 6

బుధవారం ఉదయం నుంచే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు మెగాస్టార్‌కు విషెస్‌ చెపుతున్నారు. కాగా చిరంజీవి బర్త్‌ డే కానుకగా రిలీజ్ చేసిన సైరా నరసింహారెడ్డి టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. మంగళవారం సాయంత్రం అభిమానుల కోసం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మెగా హీరోలు రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ పాల్గొని ఉత్సాహపరిచారు.

7 20

Recent Articles English

Gallery

Recent Articles Telugu