HomeTelugu Newsచిరు ఉత్సాహంతో ఆశ్చర్యపోతున్నారట!

చిరు ఉత్సాహంతో ఆశ్చర్యపోతున్నారట!

ఎంత ఎదిగినా, ఒదిగి ఉండాలనే తత్వం కలిగిన హీరోల్లో అగ్ర కథానాయకుడు మెగా స్టార్‌ చిరంజీవి ఒకరు. అంతేకాదు, క్రమశిక్షణకు ఆయన మారుపేరు. చాల కాలం విరామం తీసుకున్న తరువాత ‘ఖైదీ నంబర్‌ 150’ తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, యంగ్‌ హీరోలకు దీటుగా షూటింగ్‌లో పాల్గొంటూ ఆ సినిమాను పూర్తి చేశారు. తాజాగా, ఆయన హీరోగా నటిస్తున్నచిత్రం ‘సైరా’. ఉయ్యలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా రూపోందుతున్నచిత్రం. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

6 18

చారిత్రక నేపథ్యం కలిగిన కథ కావడంతో ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో భాగంగా స్పెయిన్‌ నుంచి వచ్చిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్నా, చిరు మాత్రం అదే ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. షూటింగ్‌ సమయంలో ఆయన చూపిస్తున్న ఉత్సాహం చూసి చిత్రబృందం ఆశ్చర్యపోతోందంట. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2019 వేసవికి ‘సైరా’ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu