HomeTelugu NewsR. Narayana Murthy: పీపుల్స్‌ స్టార్‌.. రూటే వేరు

R. Narayana Murthy: పీపుల్స్‌ స్టార్‌.. రూటే వేరు

Narayana murthy rejects ram

పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. ఆయనది అంతా డిఫ‌రెంట్ స్టైల్‌. ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా, నిర్మాత‌గా అన్నింటికంటే ముఖ్యంగా వ్య‌క్తిగా ముందు నుంచీ ఆయ‌న స్టైల్ రూటే వేరు. 90 దశకంలో విఫ్లవ సినిమాలతో ట్రెండ్ సృష్టించి పీపుల్స్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఆ టైమ్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉండేది.

ఇటీవలే సినిమాల్లో నటించిడం మానేశారు నారాయణమూర్తి. ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించకూడదు అనేది ఆయన సిద్దాంతం. అందువల్లనే.. గ‌తంలో ‘టెంప‌ర్‌’ సినిమాలోని ఓ కీల‌క‌మైన పాత్ర కోసం నారాయ‌ణ‌మూర్తిని సంప్ర‌దిస్తే సున్నితంగా ‘నో’ చెప్పారంట. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీ ఓ కీల‌క‌మైన పాత్ర‌కు నారాయ‌ణ‌మూర్తి అయితే బాగుంటుంద‌ని టీమ్ భావించింది. కానీ.. మూర్తి మాత్రం సింపుల్ గా ‘సారీ’చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిర‌కాలుగా ప్ర‌య‌త్నించినా నారాయ‌ణ‌మూర్తి ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌లేద‌ని టాక్‌.

దాంతో చిత్ర‌బృందం ఈ స్థానంలో మ‌రో న‌టుడ్ని ఎంచుకొనే ప‌నిలో ప‌డింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా నటీనటుల ఎంపిక జరుగుతున్న సంగతి తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu