HomeTelugu Newsడిసెంబర్ లో 'పడి పడి లేచే మనసు'

డిసెంబర్ లో ‘పడి పడి లేచే మనసు’

యంగ్‌ హీరో శర్వానంద్‌ మహానుభావుడు సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసింది. కాగా ప్రస్తుతం శర్వా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో నటిస్తున్నారు. నితన్‌ హరోగా తెరకెక్కిన లై సినిమాతో ఫ్లాప్‌ ఇచ్చిన హను రాఘవపూడి.. ఇప్పుడు శర్వా సినిమాతో హిట్‌ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2 26

ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కొల్‌కతా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. త్వరలో నేపాల్‌లో జరగనున్న షెడ్యూల్‌లో షూటింగ్‌ మొత్తం పూర్తివుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర బృంతం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 21 న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి విశాల్‌ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తుండగా సునీల్‌ అతిథి పాత్రలో అలరించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu