HomeTelugu Newsడ్రైవ‌ర్ రాముడు గా ష‌క‌ల‌క శంక‌ర్‌

డ్రైవ‌ర్ రాముడు గా ష‌క‌ల‌క శంక‌ర్‌

జ‌బ‌ర్ద‌స్త్‌ న‌టుడు ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్న‌ చిత్రం డ్రెవ‌ర్ రాముడు. ఈ చిత్రానికి
రాజ్ స‌త్య ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. డ్రైవ‌ర్ రాముడు అంటే మ‌న‌కు నంద‌మూరి తార‌క రామారావు , ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు గుర్తుకువ‌స్తారు. ఈ సినిమా అప్పట్లో ఎన్టీఆర్ జీవితంలో క‌మ‌ర్షియ‌ల్
బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో చిత్రాన్ని తెరకక్కిస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో
కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు. అప్పట్లో బ్రహ్మానందం, అలీ హీరోలుగా చేసినా
కమెడియన్లుగా కొనసాగుతున్నారు.

3 7

ప్రస్తుతం సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి కమెడియన్లు హీరోలుగా వస్తున్నారు, ఇప్పుడు తాజాగా జబర్దస్త్
నుంచి షకలక శంకర్ హీరోగా రాబోతున్నాడు. ప్రస్తుతం శంకర్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు.
ఈ మధ్యనే శంబోశంకర నుంచి ఒక పాట విడుదలైంది. ఇప్పుడు శంకర్ హీరోగా నటిస్తున్న డ్రైవర్
రాముడు టీజ‌ర్ ను సుధీర్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ చిత్రం
తెర‌కెక్కుతోంది, ష‌క‌ల‌క శంక‌ర్, ప్ర‌దీప్ సింగ్ రావ‌త్ కి మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు టీజర్లో చూపారు.
సునీల్ క‌శ్య‌ప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శంక‌ర్ మార్క్ కామెడీతో పాటు ఎమోష‌నల్‌గానూ క‌థ
ఉంటుంద‌ని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో శంకర్ పక్కన అంచ‌ల్ సింగ్ హీరోయిన్‌గా
న‌టిస్తోంది. ఎస్‌. ఎల్. రాజు, ఎస్ ఆర్. కిష‌న్ నిర్మాణంలో డ్రెవ‌ర్ రాముడు చిత్రం త్వ‌ర‌లోనే మ‌న
ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu