రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘పిజ్జా 2’!

వరుస హిట్లతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి నటిస్తున్న తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. సినిమా ఆడియో సీడీలను దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. తొలి కాపీ బెల్లంకొండ సురేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా..
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ”విజయ్ సేతుపతి సినిమాల్లో కొత్తదనం ఉంటుంది. వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. అతడికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి” అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ”నాలుగేళ్లలో 24 సినిమాలు చేసాడు విజయ్ సేతుపతి. అంత తక్కువ సమయంలో విజయవంతమైన సినిమా చేయడం మామూలు విషయం కాదు” అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ”తమిళంలో ఈ సినిమా చూసి తెలుగులో విడుదల చేయాలనుకున్నాం. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది” అన్నారు.
గాయత్రి మాట్లాడుతూ.. ”తమిళంలో నా కెరీర్ లో మంచి చిత్రంగా నిలిచిన ఈ చిత్రంతో తెలుగులో పరిచయమవుతుండడం సంతోషంగా ఉంది. ఇది నాకు మంచి డెబ్యూ ఫిలిం అవుతుంది” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, శోభారాణి, డార్లింగ్ స్వామి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.