HomeTelugu News'దేవదాస్‌' టీజర్‌

‘దేవదాస్‌’ టీజర్‌

నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’, ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనిదత్‌ ఈ సినిమానునిర్మిస్తున్నారు. మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు ఈ చిత్రం సెప్టెంబరు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన లభించింది.

2 26

కాగా ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. దీన్ని నాని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. దేవ ఈరోజు మంచి రోజు అంట.. నాకు ఒక స్మాల్‌ ప్లీజ్‌ అని ట్వీట్‌ చేశారు. దీనికి ముందు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని కూడా పోస్ట్‌ చేశారు.

ఈ టీజర్‌లో కేవలం ఒక సన్నివేశాన్ని మాత్రమే చూపించారు. నాగార్జున, నాని పక్కపక్కన కూర్చుని మద్యం సేవించేందుకు సిద్ధమవుతారు. నాగార్జున అలా మందు గ్లాసులో పోయగానే నాని ఆత్రంగా.. ఆయనకు తెలియకుండా తాగే ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు. సోడా కావాలా?.. వాటర్‌ కావాలా?.. దాసు ఏంటి సంగతి అనే డైలాగ్‌ మాత్రమే వినిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu