HomeTelugu Newsనేను జన్మించి 32 ఏళ్లు..విక్టరీ వెంకటేష్‌

నేను జన్మించి 32 ఏళ్లు..విక్టరీ వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి నేటికి 32 ఏళ్లు. వెంకటేష్‌ హీరోగా తెరంగేట్రం చేసిన మొదటి చిత్రం కలియుగ పాండవులు 1986 ఆగస్టు 14న విడుదల అయ్యింది. మొదటి చిత్రంతోనే హీరోగా ఘనవిజయాన్ని అందుకున్న వెంకీ అప్పటి నుంచి అగ్రకథనాయకుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా ఇన్నేళ్ల తన ప్రయాణానికి సహకరించిన వారికి వెంకటేష్‌ సోషల్‌ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

3 14

’14 ఆగస్టు 1986న కలియుగ పాండవులు సినిమా రిలీజ్‌తో నటుడిగా నేను జన్మించాను. 32 ఏళ్లుగా మీ ప్రేమానురాగాలతో నాకు సపోర్ట్‌గా నిలివటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాల్లో మీరిచ్చిన ప్రోత్సాహంతో మీకు మరింత చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నాను. త్వరలో మీకో సర్‌ప్రైజ్‌’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు వెంకీ. వెంకీ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌ దర్శకత్వంలో ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu