HomeUncategorizedపవన్‌ కళ్యాణ్‌ సినిమాలో శివ కార్తికేయన్‌‌.. స్పందించి యూనిట్‌

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో శివ కార్తికేయన్‌‌.. స్పందించి యూనిట్‌

11 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నటిస్తున్న మొదటి చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే పవన్ ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ను ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై స్పందించిన చిత్ర బృందం ఆ వార్తలను కొట్టేసింది. ఇందులో కార్తికేయన్ నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ నడుస్తుందని ఇందులో పవన్ ఒక బందిపోటు పాత్రలో కనిపించబోతున్నాడు అని సమాచారం.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu