HomeTelugu Newsబెల్లంకొండ చిత్రంలో కాజల్‌ తో పోటీ పడనున్న హీరోయిన్‌..!

బెల్లంకొండ చిత్రంలో కాజల్‌ తో పోటీ పడనున్న హీరోయిన్‌..!

ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం తన ఐదో పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. కొత్త ద‌ర్శకుడు శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రంలో ఇప్పడు మరొక నటి మెహ్రీన్ ప్రిజాద కూడా జాయిన్ అయింది. అంటే స్క్రీన్ మీద ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు పోటీపడనున్నారన్నమాట.

9 17

ఇలా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానేలు కూడ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం కొంత చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu