చిరు కోసం రంగంలోకి రాజమౌళి!

చిరంజీవి 151వ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను నిజానికి చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా లాంచ్ చేయాలనుకున్నారు. కానీ మంచి ముహూర్తం కుదరడంతో ముందుగానే సినిమాను ప్రారంభించేశారు. అయితే అసలైన పండగ మాత్రం చిరంజీవి పుట్టినరోజు నాడే ఉంటుందని తెలుస్తోంది. ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను 
చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ ను దర్శకధీరుడు రాజమౌళితో రిలీజ్ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. చిరు అడిగితే రాజమౌళి కాదనలేరు. కనుక రాజమౌళి చిరు 151వ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఖాయమంటున్నారు.
సినిమా షూటింగ్ మొదటిరోజు నుండే సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు తీసుకురావడానికి ఇతర భాషల నుండి నటీనటులను, టెక్నీషియన్స్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతారను కన్ఫర్మ్ చేశారని సమాచారం. అలానే సినిమాలో కీలక పాత్రల్లో ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్ లు కనిపించబోతున్నారని టాక్. కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయి.