HomeTelugu Newsమాదాల రంగారావుకు అస్వస్థత

మాదాల రంగారావుకు అస్వస్థత

అలనాటి విప్లవ సినిమాల నటుడు, నిర్మాత రెడ్ స్టార్ మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోస సమస్యతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చేరారు. గతేడాది మేలో తీవ్ర గుండెపోటుతో చెన్నైలో తీవ్ర గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసినట్లు, అప్పటి నుంచి హైదరాబాద్ లోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నట్లు అతని కుమారుడు మాదాల రవి తెలిపారు.

3 4

శనివారం సాయంత్రం తిరిగి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురికాగా స్టార్ హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఆయన భార్య శ్రీమతి పద్మావతి, కుమారుడు మాదాల రవి ఉన్నారు. మరో 48 గంటల పాటు పరిస్థితి విషమంగా ఉంటుందని స్టార్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu