HomeTelugu Newsరజనీ సినిమాలో బాబీ సింహా

రజనీ సినిమాలో బాబీ సింహా

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన “కాలా” చిత్రం జూన్‌ 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. పొలిటికల్‌ జోనర్‌ లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు రజనీ తరువాత సినిమా పనులు స్పీడ్ అందుకున్నాయి. సన్ పిక్చర్స్ సఁస్థ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు తమిళ యువ దర్శకుడు ” కార్తీక్‌ సుబ్బరాజ్‌” దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్స్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో “విజయ్‌ సేతుపతి” విలన్‌ పాత్రలో చేయనున్న సంగతి తెలిసిందే.

1 4

ఈ సినిమాలో రజనీకాంత్ సరసన ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చేయబోతున్నట్టు సమాచారం. కోలీవుడ్‌లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న, నేషనల్‌ అవార్డు గ్రహీత బాబీ సింహా కూడా కీలక పాత్ర చేయనున్నారని తెలుస్తోంది. కెరియర్‌ ప్రారంభం నుంచి విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, కార్తీక్‌ సుబ్బరాజ్‌ వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. అందుకే ఈ సినిమాలో సింహాకు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని వినికిడి. ఇదివరకు కార్తీక్‌ చేసిన పిజ్జా, ఇరైవి, జిగర్తాండ సినిమాల్లో వీరు నటించారు. ఇలా మొదటినుండే మంచి టాక్‌ సొంతం చేసుకొంటున్న ఈ చిత్రం పక్కా రాజకీయ నేపధ్యంలో ఉండబోతుందట. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu