HomeTelugu Newsరెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ప్రణీత

రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ప్రణీత

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సరసన అత్తారింటికి దారేది చిత్రంలో నటించి బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న నటి ‘ప్రణీత’. ఈ చిత్రం తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత ఈమె సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో బ్రహ్మోత్సవంలో చేసింది. ఈ మూవీ ప్లాప్‌తో ఈ భామ కన్నడ సినీ రంగానికి వెళ్లిపోయింది. రెండేళ్ల విరామం తర్వాత రామ్‌తో కలిసి “హలో గురు ప్రేమ కోసమే” చిత్రంలో నటిస్తోంది.

3 14

తెలుగులో కొత్త సినిమాకు ఇంత గ్యాప్‌ రావడానికి కారణమేంటో చెప్పింది ప్రణీత. తెలుగులో తనకు నచ్చే స్ర్ర్కిప్టులు రాకపోవడం వల్లే ఇక్కడ సినిమా చేయకుండా..కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇన్నాళ్ల తర్వాత తనకు మంచి పాత్ర దొరకడంతో రామ్‌తో కలిసి నటించేందుకు రెడీ అయిందట ప్రణీత. ఈ చిత్రంతో తాను సిటీగర్ల్‌గా కనిపిస్తానని, ఈ పాత్ర కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu