HomeTelugu Newsవరుణ్ తేజ్ చిత్రంలో రమ్య కృష్ణ!

వరుణ్ తేజ్ చిత్రంలో రమ్య కృష్ణ!

రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విజయవంతంగా సినిమాలు చేస్తూ మరోసారి హాట్ ఫెవరెట్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, అగ్ర హీరోలు, దర్శకులకు ఫస్ట్‌ ఛాయిస్ గా ఉండే రమ్యకృష్ణ ఇప్పడు సెకండ్ ఇన్నింగ్స్ లోను తన సత్తా చూపుతోంది. ‘బాహుబలి’ సిరీస్ తో స్టార్ నటిగా నిలబడిన ఈమె కోసం రచయితలు, దర్శకులు ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు. ముఖ్యంగా యువ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల కోసం ఈమెనే ఎంచుకుంటున్నారు.

11 4

కాగా ఇప్పటికే నాగ చైతన్య, మారుతిల ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో కీలకమైన అత్త పాత్రను చేస్తున్న రమ్యకృష్ణ త్వరలో మెగాహీరో వరుణ్ తేజ్ చిత్రంలో సైతం ఒక ముఖ్య పాత్ర చేయనున్నారు. వరుణ్ తేజ్ ‘ఆప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనే రమ్యకృష్ణ నటించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభంకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu