HomeTelugu Newsవిలన్‌గా త్రివిక్రమ్‌!

విలన్‌గా త్రివిక్రమ్‌!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పంచ్ డైలాగులతో ప్రేక్షకులకు కితకితలు పెట్టిస్తూనే.. పదునైన కరుణ రసాన్ని సున్నితంగా చెప్పగల సమర్ధుడు. అయన డైలాగుల కోసమే సినిమాకు వెళ్తారు. అజ్ఞాతవాసి సినిమా తరువాత త్రివిక్రమ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఎలాగైనా హిట్ కొట్టాలనే తపన ఈ టీజర్ లో కనిపించింది.

3 19

త్రివిక్రమ్ కు సంబంధించిన ఓ తాజా ఫొటోను బ్రహ్మాజీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అందులో త్రివిక్రమ్ హుడ్ క్యాప్, రఫ్ గడ్డంతో ఉన్నాడు. వేలితో గడ్డాన్ని రఫ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. చూడటానికి అచ్చు తెలుగు సినిమాలో విలన్‌లా ఉన్నాడు. “వస్తున్నా.. బీ రెడీ” అనే కాప్షన్ ఇచ్చాడు బ్రహ్మాజీ. అంటే అవకాశం వస్తే త్రివిక్రమ్ సినిమాలో విలన్ రోల్ ప్లే చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పే విధంగా ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu