HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌ చిరంజీవి

హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌ చిరంజీవి

6 21ఈ రోజు ఆగస్టు 22 మెగాస్టార్‌ చిరంజీవి 63వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి చిరుకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరు పుట్టినరోజుకు సందర్భంగా నిన్న ఆయన హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ను విడుదల చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. కోటి పది లక్షల మంది టీజర్‌ను వీక్షించినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి శిల్పకళా వేదికలో ఘనంగా పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ప్యామిలీ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరైయ్యారు. మెగాస్టార్‌ కు శుభాకాంక్షలు..‌

6 1 2

‘అల్లు అర్జున్‌: మా ఏకైక మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ ‘నాగార్జున: డియర్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ ‘వెంకటేశ్‌: నా స్నేహితుడు చిరంజీవికి హ్యాపీ బర్త్‌డే’ ‘రాధిక : నా ప్రియమైన మిత్రుడు, సహనటుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు రాక్‌స్టార్‌. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ‘లావణ్య త్రిపాఠి: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌ చిరంజీవి గారు. సైరా లో మీ లుక్‌ సూపర్‌’ ‘ఈషా రెబ్బా: మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు’ ‘శ్రీకాంత్‌: మీకెంతో ప్రత్యేకమైన ఈరోజు సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా’ ‘మెహర్‌ రమేశ్‌: లక్షలాది మందికి ఎంతో స్ఫూర్తిదాయకమైన మెగాస్టార్‌ చిరంజీవి అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ ‘అనిల్‌ రావిపూడి: పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు’ ‘ప్రదీప్‌ మాచిరాజు: మా ముఠామేస్త్రీ, గ్యాంగ్‌లీడర్‌, ది బాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు’

6b 1

మెహరీన్‌: మాకెంతో స్ఫూర్తిదాయకమైన చిరు సర్‌కు హ్యాపీ బర్త్‌డే’ ‘కొరటాల శివ: మా మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్‌ చేస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను’ ‘హరీశ్‌ శంకర్‌: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌. చిత్రపరిశ్రమకు మీరు అందిస్తున్న మంచి సినిమాలకు, మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ, మాకూ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేస్తున్నందుకు గానూ ధన్యవాదాలు. లవ్యూ సర్‌’ ‘సుధీర్‌బాబు: మెగాస్టార్‌ వయసు సంవత్సరం తగ్గింది. మా యంగ్‌ బ్రదర్‌ మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ ‘శ్రీను వైట్ల: మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలి సర్‌’ ‘సాయి ధరమ్‌ తేజ్‌: మీరు మాకు పంచిన స్ఫూర్తి, ప్రేమ ఎంతో పవిత్రమైనది. లవ్యూ మామా..హ్యాపీబర్త్‌డే మెగాస్టార్‌’ ‘వరుణ్‌ తేజ్‌: నా స్ఫూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ ‘వంశీ పైడిపల్లి: మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రయాణం మాకెంతో స్ఫూర్తిదాయకం’

6a

Recent Articles English

Gallery

Recent Articles Telugu