తెలియని శతృవుపై యుద్ధం చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌ ‘118’ ట్రైలర్‌

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘118’ థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. 118 పేరుతోనే సినిమా బజ్ ను క్రియేట్ చేసుకుంది. పూర్తిగా సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతుందనే విషయం తెలిసిన వెంటనే సినిమాపై ఆసక్తి పెరిగింది. థియేట్రికల్ ట్రైలర్ తరువాత సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

ఎవరో తెలియని శత్రువు కోసం చేసే పోరాటంగా ట్రైలర్ సాగుతుంది. ప్రతి విషయంపై క్లారిటీతో పనిచేసే వ్యక్తి.. తెలియని వ్యక్తికోసం పోరాటం చేయడం సినిమాకు ప్లస్ కావొచ్చు. సినిమాటోగ్రాఫర్ గుహన్ సినిమాను చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించి ఉంటాడు అనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధం అవుతున్నది. ట్రైలర్ కు మంచి మార్కులు పడ్డాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మార్చి 1 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.