HomeTelugu Trending‘18 పేజీస్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

‘18 పేజీస్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

18 Pages Movie Release Date
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘18 పేజీస్‌’. విభిన్నమైన ప్రేమ కథతో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా చిత్రబృందం స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ‘18 పేజీస్‌’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘‘ఒకవేళ ఓ ఫోన్‌.. పుస్తకంతో ప్రేమలో పడితే.. ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే, 18న సిద్ధంగా ఉండండి’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

ఈ సినిమాలో అనుపమ కథలు చదవడమే కాకుండా రాయడానికి ఆసక్తి కనబరిచే యువతిగా కనిపించనున్నారు. ఇక, నిఖిల్‌ ఫుల్‌ యంగ్‌ లుక్‌లో మరింత జోష్‌ఫుల్‌గా పాత్రలో సందడి చేయనున్నారు. సుకుమార్‌ అందించిన కథతో సూర్యప్రతాప్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu