HomeTelugu Big Storiesవిడాకులు తీసుకుంటున్న‌ అమిర్‌ఖాన్‌ దంపతులు

విడాకులు తీసుకుంటున్న‌ అమిర్‌ఖాన్‌ దంపతులు

Aamir khan and kiran rao an
బాలీవుడ్ స్టార్‌ హీరో అమిర్ ఖాన్ దంప‌తులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్ దంపతులు విడాకులు తీసుకుంటున్న‌ట్లు సంయుక్త‌ ప్ర‌క‌ట‌న చేశారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ వైవాహిక బంధంలోని ఎన్నో తీపి జ్ఞాప‌కాలు, చిరున‌వ్వులు, హాయిగా గ‌డిపిన రోజులు ఎప్ప‌టికీ గుర్తిండిపోతాయ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌పై తాము త‌మ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు చెప్పారు. తాము ఇక భార్యాభ‌ర్త‌లం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

అయిన‌ప్ప‌టికీ, త‌మ కుమారుడి బాధ్య‌త‌ను ఇద్ద‌రం తీసుకుంటామ‌ని తెలిపారు. సినిమాలు, పానీ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో క‌లిసే ప‌నిచేస్తామ‌ని చెప్పారు. తాము విడిపోవాల‌ని కొంత కాలం క్రితమే నిర్ణ‌యం తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామ‌ని వివ‌రించారు. కాగా, అమిర్ ఖాన్ 1986లో రీనా ద‌త్త‌ను పెళ్లి చేసుకుని, 2002లో విడాకులు ఇచ్చారు. అనంత‌రం కిర‌ణ్ రావ్‌ను 2005లో పెళ్లి చేసున్నాడు. ఇప్పుడు ఆమెతోనూ విడిపోతున్నాడు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu