HomeTelugu Trendingచిరంజీవి కోసం 'మెగా ప్రివ్యూ' వేసిన ఆమిర్ ఖాన్..!

చిరంజీవి కోసం ‘మెగా ప్రివ్యూ’ వేసిన ఆమిర్ ఖాన్..!

Aamir Khan Special Show for
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించగా… అక్కినేని నాగచైతన్య ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆగస్ట్ 11న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆమిర్ ఖాన్, మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. తాజాగా తన మిత్రుడు చిరంజీవి కోసం ‘మెగా ప్రివ్యూ’ను వేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షో ఇదే కావడం గమనార్హం. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ వేశారు. ఈ ప్రివ్యూకు ప్రత్యేక అతిథులుగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్ లు హాజరయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu