HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ కార్వాన్‌కు ప్రమాదం

అల్లు అర్జున్‌ కార్వాన్‌కు ప్రమాదం

Accident for allu arjun car
టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం జరిగింది. ‘పుష్ప’ షెడ్యూల్ లో ఉన్న పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్‌వాన్‌లో బన్నీ లేకపోవడంతో ఆయనకి ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కారవాన్‌లో బన్నీ మేకప్ టీం మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కారవాన్ వెనుక భాగం దెబ్బతింది. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu