HomeTelugu Big Storiesమెగాస్టార్‌ 'ఆచార్య' ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్

మెగాస్టార్‌ ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్

Acharya motion poster releaమెగాస్టార్ చిరంజీవి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రెటీలు, ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కొద్దీ సేపటి క్రితమే రిలీజ్‌ చేశారు. జనం కోసం పోరాడుతున్న వ్యక్తిగా చిరంజీవి కనిపించనున్నారని అర్ధమవుతుంది. ధర్మస్థలి అనే ఉరి ప్రజలకోసం చిరు కత్తి పట్టినట్టు గా ఈ మోషన్ పోస్టర్ లో చూపించారు. ఇక ఈ పోస్టర్ చిరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu