HomeTelugu Big Stories'ది ఘోస్ట్' ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

‘ది ఘోస్ట్’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

Vegam Lyrical Video from Th

కింగ్‌ నాగార్జున నటించిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి గ‌రుడ వేగ ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుదల కానుంది. ఇక ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఈ సినిమా విడుదల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మూవీ యూనిట్‌ వ‌రుస అప్‌డేట్‌ల‌ను విడుదల చేస్తుంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ విడుదలైంది.

‘వేగమ్’ అంటూ సాగే ఈ పాట‌లో నాగార్జున‌, సోనాల్ చౌహాన్ కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటుంది. భ‌ర‌త్-సుర‌భ్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ను కృష్ణ మ‌దినేని ర‌చించ‌గా.. క‌పిల్ క‌పిల‌న్‌, ర‌మ్య బెహ‌రా ఆలపించారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని విడుద‌ల చేయాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఇంట‌ర్‌పోల్ ఆఫిస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu