HomeTelugu Big Storiesహీరో అర్జున్‌ డైరెక్షన్‌లో విష్వక్సేన్‌.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

హీరో అర్జున్‌ డైరెక్షన్‌లో విష్వక్సేన్‌.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

Action King Arjun
టాలీవుడ్ యంగ్‌ హీరో విష్వక్సేన్ ను కన్నడ సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ గా తెలుగులోనూ ఎంతో ఆదరణ పొందిన అర్జున్ దర్శకత్వం వహించబోతున్నాడు. కథా రచయిత, నిర్మాత కూడా అతనే. ఇందులో అర్జున్ కూతురు ఐశర్య హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

‘అశోక వనంలో అర్జున కల్యాణం’ తో ఈ మధ్య మంచి హిట్ అందుకున్న విష్వక్ ప్రస్తుతం ‘దాస్‌ కా ధమ్కీ’ సినిమాలో నటిస్తున్నాడు. అది సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అర్జున్ తో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. యాక్షన్‌ హీరోగా పేరున్న అర్జున్.. ఇతర హీరోల సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషిస్తున్నాడు. అదే సమయంలో దర్శకుడిగా కూడా అతనికి అనుభవం ఉంది. ఇప్పటికే పదికి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన అర్జున్ తాజా చిత్రంతో మరోసారి మెగాఫోన్ పడుతున్నాడు.

ఈ చిత్రంతో తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వనుంది. అర్జున్ స్నేహితుడైన సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu