రకుల్ ప్రేమ వ్యవహారం నిజమేనా..?

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. గతంలో రకుల్ కి, రానా కు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినా.. వాటిపై ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తాజాగా అమ్మడు ఓ యువ హీరోతో ప్రేమలో ఉందని మరొక వార్త హల్ చల్ చేస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశాడో.. లేదో.. కనీసం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో ఆయనకు ఎఫైర్స్ నడుస్తున్నాయని టాలీవుడ్ మీడియా ప్రచురించింది. రెజీనా తో సన్నిహితంగా మెలుగుతున్నాడని, అలానే ప్రగ్య జైస్వాల్ తో చట్టాపట్టాలేసుకొని తెగ తిరుగుతున్నాడని చెప్పుకొన్నారు. ఇప్పుడు లిస్ట్ లోకి రకుల్ వచ్చింది. వీరిద్దరు కలిసి విన్నర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాటలో రకుల్ ఓ లాకెట్ ధరించిందట. ఆ లాకెట్ లో సాయి ధరం తేజ్ ఫోటో ఉందని.. ఎవరో చూసి చెప్పగా ఈ విషయం యూనిట్ అందరికీ పాకింది. ఈ విషయంపై రకుల్ ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అసలు ఆ లాకెట్ సినిమా కోసం వేసుకుందా..? లేకపోతే కావాలనే తయారు చేయించిందా..? అనే విషయం తెలియాల్సివుంది. సినిమాలో లాకెట్ కు సంబంధించిన సీన్ ఉంటే ఓకే కానీ.. లేదంటే మాత్రం అనుమానం పడాల్సిందే!