HomeTelugu Big Stories'సలార్‌' యాక్షన్‌ సీన్‌ వీడియో లీక్‌

‘సలార్‌’ యాక్షన్‌ సీన్‌ వీడియో లీక్‌

Action scene leaked from pr
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ -ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘సలార్‌’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. అయితే మొదటి నుంచి ‘సలార్‌’ మూవీకి లీక్‌ల బెడద తప్పడం లేదు. ఈ మూవీ సెట్స్‌లోని ప్రభాస్‌ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్‌ నుండి ప్రభాస్‌పై చిత్రీకరిస్తున్న యాక్షన్‌ సీన్‌ మేకింగ్‌ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్‌, చూట్టు సంచలను చూస్తుంటే ఇది హోరాహోరిగా సాగే ఫైట్‌ సీన్‌ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రభాస్‌ బర్త్‌డే (అక్టోబర్‌ 23) నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్‌’ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌తో మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. ఇందులో ప్రభాస్‌ పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu