HomeTelugu Big Storiesదుమ్మురేపుతున్న అల్లు అర్జున్‌.. 'సిత్తరాల సిరిపడు' సాంగ్‌

దుమ్మురేపుతున్న అల్లు అర్జున్‌.. ‘సిత్తరాల సిరిపడు’ సాంగ్‌

2 14
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌.. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ఈనెల 12 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతున్నది. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఈ సినిమా ఇంతటి హిట్ కావడానికి ప్రధాన కారణం సాంగ్స్. సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో సినిమా సగం హిట్టైంది.

మిగతా సగం సినిమా స్టోరీ, నటనతో విజయం సాధించింది. సినిమా రిలీజ్ వరకు బయటపెట్టకుండా ఉంచిన సిత్తరాల సిరిపడు సాంగ్ ను తాజాగా త్రివిక్రమ్ బయటపెట్టారు. ఫైట్ సీన్స్ నేపథ్యంలో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వస్తుంది. శ్రీకాకుళం యాసలో ఉన్న సాంగ్ నిజంగా సూపర్ అని చెప్పాలి. దీనికి సంబంధించిన లిరికల్ సాంగ్ ను యూనిట్ ఈరోజు విడుదల చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu