HomeTelugu Trendingపుష్ప-2లో బాలీవుడ్‌ స్టార్‌

పుష్ప-2లో బాలీవుడ్‌ స్టార్‌

Actor manoj bajpayee in pus
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌న్ని సొంతం చేసుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పుష్ప-2లో బాలీవుడ్‌ విలక్షణ నటుడు, ఫ్యామిలీ మ్యాన్‌ ఫేం మనోజ్‌ భాజ్‌పాయి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తుంది.

ఇప్పటికే సుకుమార్‌ ఆయనకు స్క్రిప్ట్‌ వినిపించగా, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక గతంలో అల్లు అర్జున్‌- మనోజ్‌ భాజ్‌పాయి కలిసి హ్యాపీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఒకే స్క్రీన్‌పై వీరు కనిపించనున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu