HomeTelugu Trendingలిప్‌ లాక్‌పై క్లారిటీ ఇచ్చిన హరిప్రియ

లిప్‌ లాక్‌పై క్లారిటీ ఇచ్చిన హరిప్రియ

9 5గీత గోవిందం సినిమాతో కన్నడ నటి రష్మిక మందనా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో విడుదలైన ఈ సినిమాలో హీరో విజయ్‌ దేవరకొండతోపాటు నటి రష్మిక నటనకు మంచిపేరు వచ్చింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమీస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే తాజాగా ఈ సినిమాలో రష్మిక-విజయ్‌ లిప్‌లాక్‌ సన్నివేశాల గురించి ప్రముఖ నటి హరిప్రియ కామెంట్‌ చేస్తుంది. ప్రస్తుతం హరిప్రియ ‘ఎల్లిదే ఇల్లితనకా’ అనే కన్నడ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నందున సినిమా ప్రమోషన్స్‌లో నటి హరిప్రియ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో హీరో సృజన్‌‌, తనకు మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తాజాగా ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలోని ముద్దు సన్నివేశాన్ని ‘గీత గోవిందం’లోని ముద్దు సన్నివేశంతో ప్రేక్షకులు పోల్చి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిప్రియ స్పందించి.. ”గీత గోవిందం’ సినిమాలో రష్మిక-విజయ్‌ దేవరకొండల మధ్య లిప్ లాక్ సీన్ జరిగింది. కానీ నేను నటించిన ‘ఎల్లిదే ఇల్లితనకా’ సినిమాలో మా మధ్య మామూలు ముద్దు సన్నివేశం మాత్రమే జరిగింది.’ అని హరిప్రియ క్లారిటీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu