మీడియాపై నటి హుమా ఖురేషీ ఆగ్రహం

ఓ హిందీ వార్తా ఛానల్‌పై బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్ తన భార్య సీమా ఖాన్‌తో కలిసి ఇటీవల స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2 స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూడటానికి హుమా ఖురేషీ కూడా వెళ్లారు. ఒకప్పుడు హుమా, సొహైల్‌ ప్రేమించుకున్నారని ప్రచారం. ఓ
వార్తా ఛానల్‌ దీని గురించి వివరిస్తూ ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది.

స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసేందుకు వచ్చిన సొహైల్‌ దంపతులు, హుమాను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో హుమా ఖురేషీ చాలా బాధపడ్డారు అని ప్రచురించింది. ఈ ఆర్టికల్‌ హుమా దృష్టికి రావడంతో ఆమె ఆ ఆర్టికల్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఆ ఛానల్‌ను ఇష్టమొచ్చినట్టు తిట్టిపోసింది. మీ చెత్త ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని నా గురించి ఇలాంటి చెత్తంతా రాస్తారా? సిగ్గులేదా.. నా పేరును చెడగొట్టడానికి మీకెంత ధైర్యం అంటూ రెచ్చిపోయింది. ఇలా చేసినందుకు నాకు, సొహైల్‌ దంపతులకు క్షమాపణలు చెప్పండి. అసలు మీకు నైతిక విలువలే లేవు. మీలాంటి ఇడియట్స్‌ను నటీనటులు పట్టించుకోరు. దానర్థం మీరంటే మాకు భయమని కాదు అంటూ మండిపడ్డారు.