HomeTelugu Big Storiesమీనా పొలిటికల్‌ ఎంట్రీ నిజమేనా?

మీనా పొలిటికల్‌ ఎంట్రీ నిజమేనా?

Actress Meenas political e

సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణమే. ఇప్పటికే పలువురు వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు. బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, ఖుష్భు, రోజా, విజయశాంతి తదితరులు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండగా.. తాజాగా మరో నటి పాలిటిక్స్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాట్లు టాక్‌.

ప్రముఖ నటి మీనా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేదే వార్తలు వస్తున్నాయి. కేంద్రమంత్రి ఎల్. మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు.

Actress Meena 1

ఈ వేడుకలో మీనాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట. తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా హైలైట్‌గా నిలిచింది. ఆమె బీజేపీలో చేరబోతున్నారని అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నారు. మీనా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం. అయితే, ఈ విష‌యం గురించి మీనా అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌టనా చేయ‌లేదు.

న‌టి మీనా పేరు చెప్ప‌గానే అందరికి ముందుగా గుర్తు వచ్చేది చంటి మూవీ. ఆ సినిమాలో ఆమె పాత్ర అంత‌టిని గుర్తింపును తెచ్చింది. అప్ప‌ట్లో తెలుగులో స్టార్‌ హీరోలు అందరితోనూ నటించింది మీనా. చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వెంక‌టేష్‌తో దృశ్యం సినిమాలో రీఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత అప్పుడప్పుడు టీవీ షోల్లో కూడా మెరుస్తుంది. ప్ర‌స్తుతం న‌టి మీనా ఎంట్రీ గురించిన వార్త సోష‌ల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

20240117fr65a76e3966849

Recent Articles English

Gallery

Recent Articles Telugu