HomeTelugu Trendingఫ్రైడ్‌ రైస్‌లో బొద్దింక.. హీరోయిన్‌ ఫైర్‌

ఫ్రైడ్‌ రైస్‌లో బొద్దింక.. హీరోయిన్‌ ఫైర్‌

Actress Nivetha pethuraj fo

హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేస్తే.. అందులో బొద్దింక వచ్చింది. దీంతో ఈ నటి సదరు రెస్టారెంట్‌, ఫుడ్‌ డెలీవరి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలో పేరుపొందిన ఓ ప్రముఖ రెస్టారెంట్‌ నుంచి బుధవారం సాయంత్రం నివేదా పేతురాజ్‌ ఫ్రైడ్‌ రైస్‌ను ఆర్డర్‌ చేశారు. ప్యాక్‌ ఓపెన్‌ చేయగానే అందులో బొద్దింక కనిపించింది. దీంతో ఆమె.. రెస్టారెంట్‌ని ట్యాగ్‌ చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఇటీవల కాలంలో హోటళ్లు సరిగ్గా పరిశుభ్రతను పాటించడం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నేను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. ఈ హోటల్‌ వాళ్లు సరిగ్గా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. కొనుగోలుదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై భారీ జరిమానా విధించాలి’ అని ఆమె అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu