HomeTelugu Trendingడ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ సంజన అరెస్ట్‌

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ సంజన అరెస్ట్‌

Actress sanjana arrested in
సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ మాఫియా ఇప్పుడు బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియాచక్రవర్తి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ విచారణలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. తాజగా నటి సంజనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం బెంగళూరులోని సంజన నివాసంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులను నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనికి ముందు మరో కన్నడ నటి రాగిణి ద్వివేది నివాసంపై కూడా అధికారులు రెయిడ్ చేశారు. మరో నటుడు రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకే సీసీబీ అధికారులు సంజన నివాసంపై దాడులు నిర్వహించారు. తెలుగులో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘యమహో యమ’, ‘బుజ్జిగాడు’ తదితర చిత్రాల్లో సంజన నటించింది. కన్నడ చిత్రం ‘దండుపాళ్యం’లో ఆమె నటకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు ఆమె అరెస్ట్ కావడం… కన్నడ పరిశ్రమతో పాటు టాలీవుడ్ లో సైతం ప్రకంపనలు రేపుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu