నాన్నకు ప్రేమతో.. కేసీఆర్‌కు శ్రీరెడ్డి ఎమోషనల్ లెటర్‌

సంచలన నటి శ్రీరెడ్డిఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకి వస్తుంటుంది అయితే..ఇప్పుడు కాస్త వెరైటీగా వార్తల్లో నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నటి శ్రీరెడ్డి బహిరంగ లేఖ రాస్తూ వార్తల్లోకెక్కింది. ఇటువంటి లెటర్లుల కేసీఆర్‌కు లక్షల్లో వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్‌ను నాన్నగారూ అంటూ సంభోదిస్తూ నటి శ్రీరెడ్డి లేఖ సంచలనంగా మారింది. కేసీఆర్‌ని నాన్న అంటూ మీ కూతురు శ్రీరెడ్డి వ్రాయునదని నాలుగు పేజీల లేఖను తన స్వహస్తాలతో రాసింది శ్రీరెడ్డి.

నాన్నగారూ.. ఈ మాటతో మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు నా కళ్లు నీళ్లతో నిండు కుండలుగా అయిపోయాయి. ఈ మాట, పిలుపుకు దూరమై దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది.. అంటూ గుండెల్ని పిండేసే ఎమోషనల్ వర్డ్స్‌తో శ్రీరెడ్డి లేఖను రాసింది. గౌరవనీయులైన.. ఉద్యమాన్ని ఊపిరిగా బతికి తెలంగాణ మొత్తానికి తండ్రి సమానులైన మా ప్రియతమ, ప్రాణ సమానులైన మా తండ్రి కేసీఆర్ గారికి నమస్కరించి మీ పాదాలను ప్రార్దిస్తూ శ్రీరెడ్డి అను కూతురు సమానురాలైన నేను వ్రాస్తున్న ప్రార్ధనా పూర్వక లేఖ’.. అంటూ మొదలుపెట్టిన ఈ లేఖలో ముఖ్యంగా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌ని ప్రస్తావించింది శ్రీరెడ్డి. అవకాశాల పేరుతో అమ్మాయిల్ని ఎలా వేధిస్తున్నారు.. వాళ్లను ఎలా వాడుకుని సెక్స్‌కి బానిసలుగా చేస్తున్నారు? తెర వెనుక ఎలాంటి బాగోతాలు నడుస్తున్నాయి తదితర విషయాల్ని ప్రస్తావించింది శ్రీరెడ్డి.

కాగా సినిమా ఇండస్ట్రీలో ఈ తెరచాటు బాగోతాలకు బాధితులు కాకుండా ఉండేందుకు వాళ్లను రక్షించేందుకు ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేస్తూ జీవోను అధికారికంగా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్యానల్‌లో నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, నందినిరెడ్డి తదితర 15 మంది సభ్యులుగా ఉన్నారు. గతంలో శ్రీరెడ్డి.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఉద్యమానికి ఊపుతెచ్చింది. ఆమెకు మహిళా సంఘాలు బాసటగా నిలవడంతో పాటు వారి పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌ను అరికట్టేందుకు ఈ జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే.