HomeTelugu Big Storiesఐటీ దాడులపై నటి తాప్సీ స్పందన

ఐటీ దాడులపై నటి తాప్సీ స్పందన

Tapsee on IT raidsబాలీవుడ్ హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇళ్లలో గత 3 రోజులుగా ఐటీ అధికారుల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మీడియాలో రకరకాల వార్తలు రావడంతో నటి తాప్సీ దీనిపై స్పందించారు. 3 రోజులుగా తన నివాసంలో ఏం జరిగిందో ట్విట్టర్ వేదికగా వివరించారు. నాకు పారిస్‌లో ఒక బంగ్లా ఉందని ఆరోపిస్తూ దాని తాళాల కోసం వెతికారని అన్నారు. కానీ తనకు అక్కడ ఎలాంటి బంగ్లాలు లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు రూ.5 కోట్లు తీసుకుని దానికి సంబంధించిన పన్ను ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వాటి రశీదులు కోసం వెతికారని తాను ఎప్పుడూ అంత మొత్తాన్ని తీసుకోలేదని తాప్సీ వివరించారు. సంపాదనకు, ఐటీ రిటర్న్స్‌కు పొంతన లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు వ్యవసాయ చట్టాలపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ప్రముఖుల ఇళ్లపై దాడులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వారంలో తాప్సీ, అనురాగ్ కశ్యప్‌తో పాటు బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఏకకాలంలో 28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu