HomeTelugu Newsతేజ సజ్జ 'అద్భుతం' ట్రైలర్‌

తేజ సజ్జ ‘అద్భుతం’ ట్రైలర్‌

adbhutham movie traile

తేజ సజ్జ, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా భారీ అంచనాలనే రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ఈ ట్రైలర్ లో.. తేజ, శివాని వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటారు. వారిద్దరికి ఒకే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకరి కాల్స్ ఒకరికి వెళ్తూ ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ తరువాత వారిద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. అనేది హ్యూమరస్ గా చూపించారు. చివర్లో ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ కథనా అని అనుమానం కలిగించి సస్పెన్స్ క్రియేట్ చేశారు. తేజ, శివాని జంట ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథను అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu