HomeTelugu Big Stories'ఆది పురుష్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఆది పురుష్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Adipurush movie release dat

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరో గా నటిస్తున్న చిత్రాల్లో ‘ఆది పురుష్‌’ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ మైథలాజికల్‌ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్‌కు ఏళ్లు పడుతుందేమో అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఆశ్చర్యకరంగా దర్శకుడు 103 రోజుల్లోనే ఆది పురుష్‌ షూటింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు పలు టెక్నికల్‌ వర్క్స్‌తో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు శివ రాత్రి సందర్భంగా డైరెక్టర్‌ ఓం రౌత్‌ ఆది పురుష్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు మేకర్స్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu