HomeTelugu Big Storiesపవన్‌ పుట్టినరోజుకు చరణ్‌ గిఫ్ట్‌..!

పవన్‌ పుట్టినరోజుకు చరణ్‌ గిఫ్ట్‌..!

ప్రముఖ నటుడు, జనసేన అథినేత పవన్‌ కల్యాన్‌ సెప్టెంబర్‌ 2న తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తన సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేస్తారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. తొలుత ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిరంజీవి పుట్టినరోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారట. కాగా రామ్‌చరణ్‌ మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు.

8 22

కానీ ఆ సమయంలో చిరు టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ను విడుదల చేశారు. దాంతో చరణ్‌ సినిమా లుక్‌ను విడుదల చేసే అవకాశం లేకుండాపోయింది. దాంతో పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజుకైనా చెర్రీ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కైరా అద్వాణీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు ఆర్యన్‌ రాజేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని చాలా కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో రాజేశ్‌, చరణ్‌లు అన్నదమ్ముల పాత్రల్లో కన్పించనున్నారని ఫిలిం వర్గాల సమాచారం‌.

ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గానూ నిర్మాతలు వివేక్‌కు రూ.3 కోట్ల పారితోషికం ఇచ్చారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై దానయ్య, పార్వతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu