HomeTelugu Big Storiesఏజెంట్: టీజర్‌

ఏజెంట్: టీజర్‌

AGENT movie Teaser

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్‌ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్‌ స్పై థ్రిల్లర్‌గా తరెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్‌ హీరోలు శివకార్తికేయన్‌, కిచ్చా సుదీప్‌ విడుదల చేశారు.

ఈ టీజర్‌లో అఖిల్ సిక్స్‌ ప్యాక్‌ బాడీ, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్‌కు మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్‌ బాగుంది. ఈ టీజర్‌ ఆకట్టుకుంటుంది. కాగా ‘ఏజెంట్‌’ చిత్రాన్ని హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ సిరీస్‌ ‘బోర్న్‌’ ఆధారంగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu