
Saiyaara Collections Worldwide:
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ‘సయ్యారా’ గురించి ఎంత చెప్పినా తక్కువే! మోహిత్ సూరి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని ఓ ఊపు ఊపేసింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా.. వీళ్ళిద్దరూ కొత్తవాళ్ళే అయినా, వాళ్ళ మొదటి సినిమాతోనే రికార్డులు బద్దలు కొట్టేశారు. మొదటి వారాంతంలోనే ఏకంగా రూ. 83 కోట్లు వసూలు చేసింది అంటే మామూలు విషయం కాదు!
నిజంగా చెప్పాలంటే, ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 5 ఓపెనింగ్ వీకెండ్స్ లో ‘సాయియారా’ ఒకటిగా నిలిచిందట. శుక్రవారం రూ. 21 కోట్లు, శనివారం రూ. 25 కోట్లు, ఆదివారం రూ. 37 కోట్లు.. ఇలా రోజురోజుకూ వసూళ్లు పెరిగాయంటే సినిమా ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు.
మోహిత్ సూరి సినిమాలు అంటేనే మంచి లవ్ స్టోరీస్, మంచి మ్యూజిక్ ఉంటాయి. ఇంతకు ముందు ఆయన తీసిన ‘ఏక్ విలన్’ (రూ. 16 కోట్లు), ‘ఆషికీ 2’ (రూ. 6.1 కోట్లు) ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్‌ని ‘సాయియారా’ చాలా ఈజీగా దాటేసింది. అంటే, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఊహించుకోండి.
ఇది కేవలం కలెక్షన్ల విషయం మాత్రమే కాదు, సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పగటి షోలలో 78.53% ఆక్యుపెన్సీ రేట్ ఉందట. అంటే, జనాలందరూ ఎగబడి చూస్తున్నారు అన్నమాట. కొత్త హీరో హీరోయిన్లతో ఇంత పెద్ద విజయం సాధించడం నిజంగా గొప్ప విషయం.
గతంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ (రూ. 70 కోట్ల లైఫ్ టైమ్), ‘ధడక్’ (రూ. 95.12 కోట్ల లైఫ్ టైమ్) సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ ని కూడా ‘సాయియారా’ దాటేసింది.
ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇందులో హృదయం పగిలిపోయే ప్రేమ, గుండె బద్దలయ్యే బాధ, ఆ తర్వాత మళ్ళీ కోలుకోవడం.. ఇవన్నీ ఉంటాయట. అహాన్ పాండే ఒక స్ట్రగుల్ అవుతున్న మ్యూజిషియన్ గా, అనీత్ పడ్డాకి అల్జీమర్స్ ఉన్న ఒక అమ్మాయిగా నటించారట. వాణి బాత్రా కూడా ముఖ్యమైన పాత్రలో ఉంది.
ALSO READ: Ram Charan Peddi తర్వాత చేయబోయే సినిమా ఇదే..













