అజిత్ పింక్ రీమేక్ ఫస్ట్‌లుక్.. వైరల్‌

విశ్వాసం సినిమాతో అజిత్ కుమార్ కోలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదిగిపోయాడు. విశ్వాసం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో బాలీవుడ్ లో బోణికపూర్ నిర్మించిన పింక్ సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు.

శ్రీదేవి ఆఖరి కోరిక ఇదే కావడంతో.. అజిత్ కాదనలేక ఒప్పుకున్నాడు. పింక్ సినిమాను సౌత్ లో రీమేక్ చేయాలన్నది శ్రీదేవి కోరిక. అజిత్ లాంటి స్టార్ హీరో అందులో నటిస్తే… సినిమాకు క్రేజ్ వస్తుందని భావించింది. తన కోరిక తీరకుండానే మరణించడంతో… ఆమె ఆఖరి కోరికను తీర్చేందుకు అజిత్ సిద్దమయ్యాడు.

పింక్ రీమేక్ కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ను నిన్న విడుదల చేశారు. అజిత్ లాయర్ డ్రెస్ లో ఉండగా ముగ్గురు అమ్మాయిలు బోనులో నిలబడి ఉంటారు. దీనినిబట్టి చూస్తే ఇది లీగల్ కు సంబంధించిన సినిమా అని అర్ధం అవుతుంది. అజిత్ పింక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్ లాంటి మాస్ హీరో ఇలాంటి సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. పింక్ రీమేక్ తరువాత అజిత్.. బోణికపూర్ నిర్మాణంలోనే మరో సినిమా చేయనున్నాడు.